Home  »  TV News  »  Illu illalu pillalu : అమూల్య సంచలన నిర్ణయం.. విశ్వక్ కేసు విత్‌డ్రా వెనుక అసలు నిజం ఇదే!

Updated : Jul 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -521 లో......ఎలాగైనా నాలాగే వాళ్ళు బాధపడేలా చేస్తానని భాగ్యంతో వల్లి చెప్తుంది. మరొకవైపు అమూల్య కేసు వెనక్కి తీసుకోవడంతో ఇంటికి వచ్చాక అందరు తనపై కోప్పడతారు. అసలు ఎందుకు ఇలా చేసావ్ వాడికి శిక్ష పడి ఉండేదని ధీరజ్ అంటాడు. తనని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశారేమోనని నర్మద అంటుంది. అప్పుడే శ్రీవల్లి ఎంట్రీ ఇస్తూ.. తప్పు చేసిన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుందని అంటుంది. అలా చేసిన తప్పుని క్షమిస్తూ పోతే తప్పు మీద తప్పు చేస్తారని వల్లిని ఉద్దేశ్శించి వేదవతి అంటుంది. అవును అలా ఒక ఛాన్స్ ఇస్తే మనదే తప్పు అవుతుందని వల్లిని ఉద్దేశ్శించి చందు అంటాడు. ఆ తర్వాత అమూల్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని రామరాజు అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మన కుటుంబం లపై పగ పెంచుకుంటారు. గొడవలు అవుతాయి. పైగా వాడు జైలుకి వెళ్తే ఆ బాధ ఇంట్లో ఉన్నవాళ్ళకి అని అమూల్య చెప్తుంది.

ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. అసలు అమూల్య కేసు వాపసు తీసుకోవడానికి కారణం నువ్వే కదా అని అంటాడు. లేదురా ఒట్టు అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ నవ్వుకుంటాడు. సచ్చినోడ నన్నే ఆటపట్టిస్తావా అని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఇద్దరు హాల్లోకి వస్తారు. వాళ్ళని వేదవతి చూసి ఏంటి గొడవ అని అడుగుతుంది. అది గొడవ కాదు అత్తయ్య రొమాన్స్ అని నర్మద అంటుంది. మీకు గుడిలో ఆ పరిస్థితిలో పెళ్లి చేసాను కానీ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారని వేదవతి అంటుంది. దూరం నుంచి వల్లి చూస్తుంది. వల్లి ఆ మాటలు విందేమోనని వేదవతికి నర్మద చెప్తుంది. వెళ్లి ఎందుకు ఇలా మాటలు వింటున్నావా అని వల్లి చెంపచెల్లుమనిపిస్తుంది వేదవతి. నేను ఏం వినలేదు అత్తయ్య చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నానని వల్లి చెప్తుంది.

మరొకవైపు అసలు అమూల్య ఎందుకు కేసు వెనక్కి తీసుకుందని విశ్వ ఆలోచిస్తాడు. అప్పుడే రేవతి, పెద్దావిడ తన దగ్గరికి వచ్చి మీకు బయపడి కేసు వెనక్కి తీసుకోలేదు. రేవతి వెళ్లి రిక్వెస్ట్ చేసిందని పెద్దావిడ చెప్తుంది. ఇప్పటికైనా ఆ కుటుంబంపై కుట్రలు మానెయ్.. వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తే నువ్వు ఇలా ఉండేవాడివా అని విశ్వపై రేవతి కోప్పడుతుంది. మరొకవైపు చందు రూమ్ లో నుంచి వెళ్తుంటే వల్లి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.